Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్‌…నేడు ఆగస్ట్‌ నెల టికెట్లు విడుదల

-

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్‌…నేడు ఆగస్ట్‌ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్ట్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టిటిడి. ఇవాళ ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా విడుదల చెయ్యనుంది టిటిడి. అటు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి.


TTD will release the earned service tickets online for the month of August at 10 am today

కాగా, తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి. తిరుమలలో సిఫార్సు లేఖల పై విఐపి బ్రేక్ దర్శనాల జారీని పున:ప్రారంభించింది టిటిడి పాలక మండలి. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16వ తేది నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టిటిడి. అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పోలింగ్ పూర్తికావడంతో మళ్లీ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి సిఫార్సు లేఖల స్వీకరణ పై టిటిడి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం… వీఐపీ బ్రేక్ దర్శనాలకు పర్మిషన్‌ ఇచ్చింది. దీంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version