ముచ్చుమర్రి బాలిక కేసులో ట్విస్ట్‌.. వీళ్ళు మామూలు ముదుర్లు కాదు.. !

-

నంద్యాల పగిడ్యాల మం ముచ్చుమర్రి లో బాలిక ఘటనలో సస్పెన్స్ ఇంకా వీడలేదు. ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 7వ రోజు గాలింపు చర్యలు కొనసాగనున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి అదృశ్యమైంది బాలిక(9). అయితే.. ప్రస్తుతం పోలీసుల అదుపులో మైనర్ బాలులు, తల్లిదండ్రులు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం కాలువలో మృతదేహాన్ని పడేశామని మైనర్ బాలురు వెల్లడించారు. రెండు రోజుల క్రితమేమో గ్రామ సమీపంలోని స్మశానంలో పడేశామని బాలురు చెప్పారట.

Twist in Muchumarri girl’s case

తాజాగా బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని చెప్పారు మైనర్ బాలుని తండ్రి. ఈ తరుణంలోనే ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో కృష్ణా నదిలో గాలించారు పోలీసులు. పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు మైనర్ బాలురు. డిఐజి స్థాయి అధికారి కేసును పర్యవేక్షించినా లభించని బాలిక (9) మృతదేహం ఆచూకీ లభించలేదు. కనీసం బాలిక మృతదేహం అయిన అప్పజెప్పాలని వేడుకుంటున్నారు బాలిక తల్లిదండ్రులు.

Read more RELATED
Recommended to you

Latest news