గత మూడు, నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలకుతలమైన విషయం తెలిసిందే. విజయవాడ నగరమంతా జలమయంగా మారింది. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. సీఎం చంద్రబాబు రెండు, మూడు రోజుల నుంచి విజయవాడలో ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.
వరద బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారికి అవసరమయ్యే నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. అయినప్పటికీ కొంత మందికి అక్కడక్కడ అందడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరదల్లో చిక్కుకుని రెండు రోజుల తర్వాత తిరిగి కలుసుకున్నారు. తరువాత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నా తండ్రీకొడుకులు. విజయవాడ – సింగ్ నగర్‌లో వరదల్లో తప్పిపోయి తిరిగి రెండు రోజుల తర్వాత కలుసుకున్నారు తండ్రీకొడుకులు. వీరిని చూసిన వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. వరదల్లో కొట్టుకుపోయిన వారు చాలా వరకు ప్రాణాలు కోల్పోవడంతో వీరు కూడా ప్రాణాలు కోల్పోయారనే ఊహించుకున్నారట. తిరిగి చేరుకొని భావోద్వేగానికి గురయ్యారు.