చంద్రబాబును ప్రశ్నించలేక దళిత మంత్రి పై ఫైర్.. పవన్ పై జగన్ విమర్శ..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  మాట్లాడటం ఆశ్యర్యకరంగా ఉందని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఈ విషయంలో చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేకనే దళిత మంత్రి పై ఫైర్ అయ్యారని చెప్పారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఓ మహిళను టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే పవన్ ఏం చేశారని దుయ్యబట్టారు. సినిమా డైలాగులు మాత్రమే కొడతారని విమర్శించారు.

అలాగే సీఎం చంద్రబాబు  బావమరిది సొంత నియోజకవర్గం హిందూపురంలో జరిగిన ఘటన పై కనీసం బాధితులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరామర్శించే స్థాయిలో లేడన్నారు. హోంమంత్రి కూడా తన పక్క నియోజకవర్గంలో తొమ్మిదో తరగతి బాలిక ను ప్రేమోన్మాది నరికి చంపినా కానీ ఆమె పరామర్శించలేదన్నారు. మరోవైపు టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో ఫేక్ పోస్టులు పెడుతున్నారని మండి పడ్డారు జగన్. ఇక వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. 

Read more RELATED
Recommended to you

Latest news