ఆయన నోటి నుంచి రాకూడని మాటలు వస్తున్నాయి : హోంమంత్రి అనిత

-

పులివెందుల MLA నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని అత్యాచారంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు అని హోంమంత్రి అనిత అనారోపించారు. అయితే ఆయన నోటి నుంచీ రాకూడని పదాలు వస్తున్నాయి. నిన్న ఒక మాజీ మంత్రి తప్పులు చేయడంతోటే తక్కువ సీట్లు వచ్చాయని ఆయన అన్నారు. అయితే రాజకీయ ఉగ్రవాదులతో నీచమైన పోస్టులు పెట్టించారు. నేషనల్ క్రైం రిపోర్ట్ ప్రకారం గత ఐదేళ్ళ కాలంలో ప్రతీ 8 గంటలకూ ఒక అత్యచారం, ఒక హత్య జరిగాయి. ఇక అధికారం పోయాక వాళ్లకు అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా అని ప్రశ్నించిన హోంమంత్రి అనిత.. ఏపీ పరిస్ధితి గత ఐదేళ్ళలో వెంటిలేటర్ మీదకు వెళ్ళిపోయింది.

నడిరోడ్డు మీద ఆడపిల్లని స్వతంత్ర దినోత్సవం రోజే పొడిచి గత ప్రభుత్వం లో చంపేసారు అని హోంమంత్రి అనిత గుర్తు చేసారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారు‌. ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా నీకు.. అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారు గత ప్రభుత్వ హయాంలో మేం ఏరోజూ మిమ్మల్ని అడ్డుకోలేదు. ఇప్పుడు మీ ఆఫీసుల మీద దాడులు జరగలేదే. మాది ప్రజారంజక పరిపాలన… 28% క్రైం రేట్ తగ్గింది. క్రిమినల్ కి రాజకీయం ఏం ఉంది… క్రిమినల్ కి కులాలు, మతాలు, రాజకీయాలు ఏం ఉంటాయి. రాజకీయ లబ్ధికోసం అభంశుభం తెలీని ఆడపిల్లల విషయంలో మాట్లాడద్దు అని హోంమంత్రి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news