ఏపీకి కేంద్రం మరో శుభవార్త..

-

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి కొత్తగా మూడు ఫిషింగ్ హార్బర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల బదులిచ్చారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, అనకాపల్లి జిల్లా పూడిమడక, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం లలో రూ.1,137.20కోట్లతో వీడిని నిర్మించనున్నట్లు తెలిపారు.

కేంద్రం తన వాటగా రూ.240కోట్లను కేటాయిస్తుందని చెప్పారు. సీఎం మత్స్యసంపద యోజన కింద ఈ నిధులు సమకూరుస్తున్నామన్నారు. అలాగే నెల్లూరు జిల్లా జువ్వలదీన్నేలో రూ.288.80కోట్లతో మరో హార్బర్ నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లా ఓడరేవు, గుంటూరు జిల్లా నిజాంపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, మచిలీపట్నంల దగ్గర నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version