రిజర్వేషన్ గురించి టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

-

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు స్థానం ఖరారైన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి కేబినెట్‌ మంత్రి పదవి దక్కింది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు.

16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ.. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తనకు కేంద్రమంత్రి పదవి దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు రిజర్వేషన్ల తమ ఆలోచనలో మార్పు లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర కేబినెట్ లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని తెలిపారు. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్ర మంత్రి పదవి దక్కిందని అన్నారు. కేంద్రంతో దృఢమైన సంబంధాలు ఉన్నాయని.. చర్యల తర్వాతే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఏపీ అభివృద్ధే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news