నంద్యాల జిల్లాలో యురేనియం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం పరీక్షల వ్యహారం సద్దుమనగకముందే తెరపైకి వచ్చాయి ఈ యురేనియం పరీక్షలు. అయితే ప్యాపిలి మండలం.. మామిళ్ళపల్లి, రాంపురం, జక్కసాని కుంట్ల పరిధిలో యురేనియం పరీక్షలకు టెండర్లు పిలిచారు. కోర్ డ్రిల్లింగ్ కు టెండర్లను ఆహ్వానించింది అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. 3 గ్రామాల్లో 5 కి.మీ పరిధిలో డ్రిల్లింగ్ కి టెండర్ ఆహ్వానించింది AMD.
అయితే పెద్ధోడ్డి రిజర్వ్ ఫారెస్ట్, టేకులకొండ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని సాగు పొలాల్లో పరిహారం చెల్లించిన తర్వాతే బోర్ డ్రిల్లింగ్ వేయాలని నిబంధన పెట్టింది. 96 mm, 75.70mm , 60 mm డయామీటర్ కొలతతో డ్రిల్లింగ్ వేసేందుకు టెండర్ కు ఆహ్వానం పంపింది. ఒక్కో బోర్ 450 అడుగుల నుంచి 1350 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ వేయలని నిర్ణయం తీసుకుంది. అయితే గత నెల 10న టెండర్ ఆహ్వానించి ఈనెల 18 వరకు గడువు ఇచ్చింది AMD. అయితే AMD కార్యకలాపాలపై తమకు ఎలాంటి సమాచారం లేనంటున్నారు రెవెన్యూ అధికారులు.