గురుకులంలో ఫుడ్ పాయిజన్.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే : హరీష్ రావ్..!

-

గురుకులంలో ఫుడ్ పాయిజన్.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మాజీ మంత్రి హరీష్ రావ్ అన్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన హరీష్ రావ్.. గురుకులాలా లేక నరక కూపాలా.. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా అని ప్రశ్నించారు. వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నది. ఈరోజు నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇప్పుడు నారాయణ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులల్లో, ప్రభుత్వ పాఠశాలలో అసలు ఏం జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది.. మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి. ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేసారు హరీష్ రావ్.

Read more RELATED
Recommended to you

Latest news