గుడివాడలో వైకాపా కార్యాలయం ఖాళీ చేయించింది థియేటర్ యాజమాన్యం. గుడివాడలోని శరత్ ధియేటర్ కొన్నేళ్లుగా కొడాలి నాని అధ్వర్యంలో నడిచింది వైసీపీ గుడివాడ కార్యాలయం. అయితే… గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని శరత్ థియేటర్ ను కొడాలి నాని ఆక్రమించుకున్నారని యాజమాన్యం ఆరోపణలు చేసింది.
కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ ను స్వాదీనం చేసుకున్న యజమాన్యం. శరత్ టాకీస్ యాజమా న్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి హాజరయ్యారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇతర టిడిపి నేతలు.
అటు థియేటర్లో వైకాపా ఫ్లెక్సీలు….కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం. ఈ సందర్భంగా థియేటర్ వాటాదారుడు యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏళ్ల తర్వాత నా ఆస్తిని చూసుకునేందుకు వచ్చాను….75% వాటా ఉన్న తాము…. తమ కష్టాన్ని ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరామని తెలిపారు. మా భాగస్వామ్యులం హక్కుగా మా ఆస్తిని పరిరక్షించుకుంటాం….తమ విజ్ఞప్తి మేరకు టీ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు అన్నారు.