Chandipura Virus : భయాందోళనలకు గురి చేస్తున్న చండీపురా వైరస్.. లక్షణాలు ఇవే?

-

Chandipura Virus: గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతులం చేసింది. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఈ భయంకరమైన మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలోనే మరో కొత్త వైరస్ వ్యాప్తి చెంది అందరిని భయాందోళనలకు గురిచేస్తుంది.

Chandipura Virus
Chandipura Virus

గుజరాత్ లో చండీపురా అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ చిన్నపిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపడంతో 2 రోజుల వ్యవధిలోనే 5 గురి పిల్లలు మరణించినట్టు వైద్యులు మరణించినట్టు తెలిపారు.
వైద్యులు సమాచారం ప్రకారం ఈ వైరస్ మొదట జ్వరానికి కారణమవుతుందని తెలిపారు. ఇక ఈ వైరస్ ఈగలు దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు వెల్లడించారు.

ఈ వ్యాధి వ్యాప్తి చెందిన పిల్లల మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది మెదడు మొత్తం వాపు రావడమే కాకుండా రోజురోజుకు వారి పరిస్థితి మరింత క్షీణించి పోతుందని తెలిపారు. ఇలా ఈ వైరస్ వ్యాప్తి చెందితే తీవ్రమైనటువంటి జ్వరం తలనొప్పి వంటి లక్షణాలు కనబడతాయి. అయితే ఈ వైరస్ 1966వ సంవత్సరం మహారాష్ట్ర నాగపూర్ లో చండీపూర్ అనే గ్రామంలో మొదటిసారి బయటపడింది. 15 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు ఈ వైరస్ బారిన పడి చనిపోవడంతో ఈ వైరస్ కి చండీపూర్ అనే పేరు వచ్చింది.

ఇక ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే మన చుట్టూ పరిసర ప్రాంతాలలో దోమలు ఈగలు పెరగడానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి, అలాగే పూల కుండీలలో కూడా నీరు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ వైరస్ ను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news