పాఠకులకు వదిలేస్తూ..: వంశీ మాట – బాబుకు మంట… ఎక్కడంటారు?

-

గత సార్వత్రిక ఎన్నికలు ఏ మూహూర్తాన్న జరిగాయో కానీ.. బాబును మరీ ఆటలో అరటిపండును చేసుకుని మరీ ఆడేసుకుంటున్నారు… 40ఏళ్ల ఇండస్ట్రీ.. మూడు సార్లు ముఖ్యమంత్రి అన్న సోయా ఏమాత్రం లేకుండా బాబును గత ఏడాది కాలంగా ఎవరికి దొరికినట్లు వారు ఏకేస్తున్నారు. వీరిలో మిగిలినవారి ఏకుడు ఒకెత్తు అయితే… బాబు సామాజికవర్గానికి చెందినవారి ఏకుడు మరొకెత్తు! వీరిలో ఇప్పటికే కొడాలి నాని ఫస్ట్ ప్లేస్ సంపాదించేయగా.. సెకండ్ ప్లేస్ లో వల్లభనేని వంశీ సుస్థిరంగా ఉన్నారు! ఈ క్రమంలో వంశీ బాబుకు ఎక్కడో మండే మాటలు మాట్లాడారు!

బాబుని ఎవరైనా తిట్టినా పడతారేమో కానీ… జగన్ ని పొగిడితే ఏమాత్రం తట్టుకోలేరు! వైఎస్ విగ్రహాన్ని చూడటానికే ఇష్టపడకుండా.. రోడ్డుకి అడ్డం అంటూ తీయించేసిన బాబు… వైఎస్ పుత్రుడు జగన్ ని పొగిడితే భరిస్తారా? పైగా ఆయన లాక్కున్న పార్టీలోని వ్యక్తి, సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే జగన్ ని పొగిడితే బాబుకు మండదా!? ఎందుకు మండదు…తమ్ముళ్ల సమాధానం!

ఇలా బాబు మంటకు కారణమైన వ్యక్తి… టీడీపీ.. సారీ సారీ.. వైకాపా… మళ్లీ సారీ సారీ… గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ! “రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి మునుపెన్నడూ చూడని స్థాయిలో సంక్షేమ పాలన అందిస్తున్నారు” అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు! ఈ ఒక్క మాట చాలదా.. బాబుకు ఎక్కడ మండాలో అక్కడ మండటానికి! అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే సుమా… ప్రజలు సమస్యలు అడిగిమరీ తెలుసుకుని పరిష్కారించే వ్యక్తిత్వం జగన్ సొంతం అని అన్నారు! ఇక నో కామెంట్స్…. బాబు ఫీలింగ్స్ పాఠకులకు వదిలేస్తూ…!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version