వంగా గీత ఎవరికీ భయపడే వ్యక్తికాదు.. పవన్ కళ్యాణ్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తానని… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగ గీత కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్స్ కు పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. గతంలో వంగ గీతాను ప్రజా రాజ్యం పార్టీ తరపున గెలిపించుకున్నామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
ఇక ఇప్పుడు వైసీపీని వీడి వంగ గీత జనసేనలో చేరాలని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే ఈ వ్యాఖ్యలకు వంగ గీత కౌంటర్ ఇచ్చారు. నేను కూడా పవన్ కళ్యాణ్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అంటూ సెటైర్లు పెంచారు. పవన్ కళ్యాణ్ దింపుడు కళ్లెం ఆశలు అంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను చిత్తుచిత్తుగా ఓడిస్తానని శబధం చేశారు వంగ గీత.