ప్రజాపాలన విజయోత్సవాలను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది ప్రజా పాలనపై బీఆర్ఎస్ అసూప్రజాపాలన విజయోత్సవాలను ఆ పార్టీలు ఓర్వలేకపోతున్నాయి : అద్దంకి దయాకర్య పడుతుంటే, బీజేపీ దొంగాటలు ఆడుతుందన్నారు.బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్యారంటీలంతా గారడీలా మారాయన్నారు. తమది బీజేపీలాగా బురిడీ కొట్టించే పార్టీ కాదన్నారు.సంక్రాతికి గంగిరెద్దులు వచ్చినట్టు బీజేపీ నేతలు వచ్చి శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షాలు దేశాన్ని ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియనది కాదన్నారు. దేశాన్ని ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ..ఈరోజు బీజేపీ ఇండియా లిమిటెడ్..దేశాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. అదానీ, అంబానీతో బీజేపీ దోపిడీ చేయిస్తోందని, బీజేపీలో లాగా కాంగ్రెస్‌లో దోపిడీ ఉండదని చెప్పారు.ప్రతిపక్షాలను కాదనే తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇచ్చారని వివరించారు. తమ ప్రభుత్వంపై శాపనార్ధాలు తప్ప కేంద్రం నుంచి బీజేపీ నేతలు నిధులు మాత్రం తేవడం లేదని మండిపడ్డారు.