షర్మిల ఓ ఊసరవెల్లి..చంద్రబాబును మించిపోయిందని ఫైర్ అయ్యారు వాసిరెడ్డి పద్మ. షర్మిల నీచమైన రాజకీయం చేస్తున్నారు..కేసు విచారణలో ఉండగా హంతకుడు అని ఎలా అంటారని నిలదీశారు వాసిరెడ్డి పద్మ. షర్మిల బుర్రలో ఏమీ అనిపిస్తే అదే నిజమా..? కోర్టు విచారణ జరుగుతుంది కదా..? షర్మిల వి పతన రాజకీయాలు అని ఫైర్ అయ్యారు. వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్ర రాజకీయాలు కడప ప్రజలు చాలా కాలంగా చూస్తూనే ఉన్నారన్నారు.

చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకోవడం మా దురదృష్టమని తెలిపారు వాసిరెడ్డి పద్మ. స్వార్థ ప్రయోజనాల కోసమే షర్మిల, సునీతా చంద్రబాబుతో చేతులు కలిపారని ఆగ్రహించారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ..రాజకీయాల్లో షర్మిల చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా తయారయ్యారని ఆగ్రహించారు వాసిరెడ్డి పద్మ. మొన్నటి వరకూ తెలంగాణ అన్నారు.. ఇప్పుడు ఏపి అంటున్నారు..ఇన్ని యూ టర్న్ లు ఎందుకు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.