Fact Check: ఆధార్ ఉంటేనే తిరుమల లడ్డూలు…టీటీడీ క్లారిటీ !

-

తిరుమల శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం తీసుకుందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది. ఇక తిరుమల వెళ్లే వారికి లడ్డూలు రెండే అంటూ నిన్న ఓ వార్త వైరల్‌ అయింది. గురువారం నుంచే అమల్లోకి.. అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరి అంటూ కూడా కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి నెలరోజుల తర్వాతే మళ్లీ అవకాశం అని కూడా ప్రచారం చేశారు.

Restrictions on Tirumala laddus

దళారులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం తీసుకోలేదని తాజాగా క్లారిటీ ఇచ్చింది. అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్‌ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని వివరించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. దర్శన టికెట్‌, టోకెన్‌ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూలు విక్రయిస్తామని క్లారిటీ ఇచ్చారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డూ విక్రయ విధానం కొనసాగుతుందన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news