ఒడిషా సీఎంగా మోహన్‌ మాఝీ ప్రమాణ స్వీకారం

-

రెండు దశాబ్దాల తర్వాత ఒడిశాకు కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. ఆదివాసీ నేత మోహన్‌చరణ మాఝి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మాఝీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.

భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలుగా కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌, ప్రవతి పరీదా ప్రమాణ స్వీకారం చేశారు. మాఝీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒడిషా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ హాజరయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రిగా మాఝి కుటుంబం  మీడియాలో ఈ వార్త చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఇలాంటి ఓ సందర్భం ఒకటి వస్తుందని అనుకోలేదంటూ ఆనందం వ్యక్తం చేసింది.

గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్‌ గమాంగ్‌ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా, ఇప్పుడు మాఝి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version