ప్రచారంలో విడదల రజినీ దూకుడు..జ‌గ‌న‌న్న‌తోనే సాధ్యమంటూ !

-

ప్రచారంలో విడదల రజినీ దూకుడు..పెంచారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో మాత్ర‌మే మ‌న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో న్యాయం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్ర‌జ‌లంతా న‌మ్ముతున్నార‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. గుంటూరు అమ‌రావ‌తి రోడ్డు, పోస్ట‌ల్ కాల‌నీలో దాదాపు 100 మందికిపైగా బీఎస్సీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. బీఎస్సీ న‌గ‌ర అధ్య‌క్షుడు చింతా రాంప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు.

vidadala rajini

పార్టీలో చేరిన‌వారిలో బీఎస్పీ న‌గ‌ర అధ్య‌క్షుడు రాంప్రసాద్‌, బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, బ‌హుజ‌న మ‌హాసేన రాష్ట్ర‌ అధ్య‌క్షుడు, బీఎస్పీ జిల్లా మాజీ అధ్య‌క్షుడు వ‌ర్ధ‌న్‌తోపాటు బ‌హుజ‌న స‌మాజ్‌పార్టీ గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఇన్‌చార్జి విజయకుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, పార్టీ ప‌ట్ట‌ణ ఆర్గనైజిగ్ సెక్రటరీ శ్రీనివాస్, డాక్ట‌ర్ సీఎస్ రావు, తేజ‌, సాధిక్‌, జాన్స‌న్‌, మహేంద్ర, అరుణ, సాదిక్, స్వామి, శ్రీనివాస్, శేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఆయా డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు,పార్టీ అధ్య‌క్షులు, అనుబంధ విభాగాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news