CBN ముద్దాయిగా తేలితే.. ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అంటూ వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేసు కోర్టులో ఉంది. దర్యాప్తు సంస్థ సాక్ష్యాలు సమర్పించింది. చంద్రబాబు అరెస్టు అయ్యారు. విచారణకు టిడిపి నేతలు ఎందుకు భయపడుతున్నారు…? ఒకవేళ కోర్టులో ఆయన నిర్దోషిగా తేలితే బయటకు వస్తారు.
లేకుంటే ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అవుతారు లేదా ఎన్నికల్లో ఆరేళ్లు పోటీ చేయకుండా డిపార్ అవుతారు’ అని కీలక కామెంట్స్ చేశారు. ఇక మరో పోస్ట్ లో నారాయణ సెటైర్లు పేల్చారు వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి. కామ్రేడ్లలోనూ అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, మతతత్వం పెరిగిపోయాయి. అందుకే సిపిఐ, సిపిఎం తెలుగు రాష్ట్రాల్లో కేవలం తోక పార్టీలుగా మిగిలిపోయాయి. పేదలకు దూరమై పెత్తనం చేసే కులసంఘాల నాయకులకు కమ్యూనిస్టు పార్టీలను దగ్గర చేశారీ నేతలు. నారాయణ…!నారాయణ…! నారాయణ!అంటూ చురకలు అంటించారు వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి