ఉరి తీసే ముందు అధికారులు ఎం చేస్తారో తెలుసా…?

-

పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో నిర్భయ హంతకులను జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయనున్నారు అధికారులు. నలుగురు దోషులను తిహార్ జైల్లోని మూడో నంబర్ కారాగారంలో ఒకేసారి శిక్ష అమలు చేయనున్నారు అధికారులు. దీనితో అసలు ఉరి శిక్షను ఏ విధంగా అమలు చేస్తారు…? అమలు చేసే ముందు అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఒకసారి చూద్దాం.

తిహార్ జైల్లో బుధవారం డమ్మీ ఉరిశిక్షను అమలు చేస్తారు. అంటే పబ్లిక్ వర్క్స్ విభాగానికి చెందిన ఇంజనీర్ తనిఖీల్లో భాగంగా దోషుల బరువు కంటే కాస్త ఎక్కువ బరువు ఉన్న ఇసుక బస్తాలను 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీసి ఉరికంబాల పటిష్టతను పరీక్షించనున్నారు. ఉరితీయడానికి ముందు రోజు సాయంత్రం కూడా మరోసారి జైలు అధికారులు ఈ పరిక్షలు చేస్తారు.

బిహార్లోని బక్సర్ జైలు నుంచి వారిని ఉరి తీయడానికి తాళ్ళు తెప్పిస్తున్నారు అధికారులు. ఉత్తరప్రదేశ్ మీరట్ జైలు నుంచి తలారి పవన్ ని తీసుకురానున్నారు. ఒకేసారి నలుగురిని ఉరి తీయడానికి పవన్ అంగీకరించినట్టు సమాచారం. నిందితుల ఎత్తు, బరువుకు అనుగుణంగా తాళ్ళను తయారు చేయిస్తారు అధికారులు. ఉరి శిక్షను అమలు చేసే ముందు కుటుంబ సభ్యులతో సమావేశ పరుస్తారు అధికారులు. ఆ తర్వాత ఆరోగ్య పరీక్షలను రెండు రోజులకు ఒకసారి నిర్వహించి ఉరి తీస్తారు. డెత్ వారెంట్ వచ్చిన తర్వాత వారితో ఏ పనులు చేయించరు.

Read more RELATED
Recommended to you

Latest news