పేదలకు గృహాలు, ఇళ్ల స్థలాలివ్వడంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్‌ – విజయసాయిరెడ్డి

-

పేదలకు గృహాలు, ఇళ్ల స్థలాలివ్వడంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్‌ అన్నారు విజయసాయిరెడ్డి. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంకా కేవలం రూపాయికే కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం గతంలోని అన్ని సర్కార్ల కన్నా చాలా ముందుందని తెలిపారు. కేవలం ఉన్నతాధికారులకు, సంపన్నులకే సొంతమని మొదట్లో భావించిన రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి మచ్చుతునక అన్నారు.

ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులను పూర్తిగా అధిగమించే దశకు రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో పేద ప్రజలకు 30 లక్షల 60 వేల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ వాగ్దానం చేసినట్టుగానే తాను అధికారంలోకి వచ్చాక కేవలం రూపాయికే టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇస్తోంది. ఇంకా 21 లక్షల గృహాలు, సమస్త సౌకర్యాలతో 17 వేల ఇళ్ల కాలనీలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఈ వివరాలను ఇటీవల కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారు. రాజధాని అమరావతిలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా సీఆర్డీఏ చట్టాన్ని సవరించి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అన్ని చర్యలూ తీసుకుంది ప్రభుత్వం అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news