వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గృహ అవసరాల సిలిండర్ ధరను 200 రూపాయల మేర తగ్గిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వైసిపి స్వాగతిస్తోందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు విజయసాయిరెడ్డి. దీనివల్ల నేరుగా కోట్లాదిమంది జనాలకు డబ్బులు ఆదా అవుతాయని… వాటిని ఇతర అవసరాల కోసం వాడుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.
మద్దతురగతి వారికి ఇది ఎంతో లాభం చేకూరుతుందని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.కాగా, కేంద్రం వంటగ్యాస్ ధరలు రూ. 200 మేర తగ్గించడంతో ఏపీలో సిలిండర్ ధరలు రూ. 915కు చేరింది. అటు తెలంగాణలోని హైదరాబాదులో రూ. 955గా ఉంది. ఉజ్వల కనెక్షన్ అయితే మరో రూ.200 తక్కువకే సిలిండర్ వస్తుంది. తగ్గింపు ధరలు నేటి నుంచి అమలు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 40 సబ్సిడీ వస్తోంది. ధరలు తగ్గించిన తర్వాత ఎంత సబ్సిడీ ఉంటుందనే దానిపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.