టీడీపీ నుంచి మహా న్యూస్ ఛానెల్ కు డబ్బులు వచ్చాయని…విజయసాయి మరో సంచలన పోస్ట్ పెట్టారు. జర్నలిస్టులను, ఫోర్త్ ఎస్టేట్‌ను అవమానించారు అని టాల్కమ్ పౌడర్ డబ్బా పదేపదే విమర్శలు చేస్తున్నాడు. కానీ “మహాచెత్త న్యూస్”లో ఉద్యోగులను అరేయ్, ఒరేయ్ అంటూ టాల్కమ్ అజ్ఞాని చిందులు తొక్కడం నిజం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. పనిచేసే సిబ్బందిని టాల్కమ్ బూతులు తిడుతుంటాడు … అందరితో అమర్యాదగా ప్రవర్తిస్తాడు.
ఈ పౌడర్ డబ్బానా కోటు వేసుకుని తెరపై కూర్చుని నీతులు చెప్పేది? అలాగే సంస్థలో పనిచేసే డబ్బా ప్రైవేట్ సైన్యంలోని మనుషులు యాంకర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఏమైనా చర్యలు తీసుకున్నావా? అని నిలదీశారు. చంద్రబాబు పీఆర్వో రమేష్‌తో నీకున్న సంబంధాలు ఏంటి? చంద్రబాబు, లోకేష్‌కు దగ్గరకావడానికి నీవు చేస్తున్న ప్రయత్నాలేంటి? చానెల్‌ను అడ్డం పెట్టుకుని కవరేజ్ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థుల నుంచి కోట్లలో సొమ్ము దండుకున్నది నిజం కాదా ? మిగిలిన చానెల్స్ ఇలా ఐటెమ్‌ల చొప్పున డబ్బులు వసూలు చేశాయా?అంటూ ఆరోపణలు చేశారు సాయిరెడ్డి.