వారికి సెలవులు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం!

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వెంటనే సరిచేసేలా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.

కాగా,వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలతో పోటెత్తిన వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు తెగి చాలా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లోకి నీళ్లు చేరి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు ఇవాళ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుండటంతో ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news