చిటికెలో గ్యాస్ట్రిక్ తగ్గాలంటే ఇలా చెయ్యండి…

-

ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బందిని పెడుతున్న అనారోగ్య సమస్యల్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఒకటి. గ్యాస్ట్రిక్‌కు చాలా రకాల నివారణలు ఉన్నా కానీ ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రావడంతో చాలా మంది దీనితో బాధపడుతున్నారు.అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు తరచుగా మాత్రలు వేసుకోవడం, కొన్ని జ్యూస్‌లు లేదా డ్రింక్స్ తాగడం ద్వారా కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే పొందగలరు. ఈ పద్ధతి దీర్ఘకాలిక సమస్యను నయం చేయదు. ఐతే గ్యాస్ట్రిక్ సమస్యను ఇంట్లోనే పరిష్కారం ఉంది. అదెలాగో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

 

సగం ఉల్లిపాయ, 3 వెల్లుల్లి రెబ్బలతో పాటు కొంచెం ఉప్పు తీసుకొని వాటిని బాగా రుబ్బుకోవాలి. దీన్ని గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగితే గ్యాస్ట్రిక్ ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే అల్లం తీసుకుని బాగా గ్రైండ్ చేసి నీళ్లలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో రెండు ధనియాలు, జీలకర్ర పొడి వేసి తాగాలి. భోజనం చేసిన తర్వాత కూడా దీన్ని తీసుకోవాలి. అప్పుడు ఈ సమస్య ఈజీగా పోతుంది. ఇంకా ఒక గ్లాసు నీళ్లలో చిటికెడు సోపు, కొత్తిమీర తరుగు వేసి రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద ఉంచి, ఆ తర్వాత తీసి తాగాలి. ఇలా చేసిన కూడా సమస్య తగ్గిపోతుంది.

అలాగే కడుపులో ఆమ్లం పెరగడానికి pH స్థాయి పెరుగుదల ప్రధాన కారణం. యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు పుల్లటి టేకు, కడుపు నొప్పి ఖచ్చితంగా వస్తుంది. ఈ సందర్భంలో, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో కలిపి, భోజనం చేయడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.ఈ సమస్యకు తేనె కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని నాలుగైదు చుక్కల వేడి నీటిలో కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఈజీగా నయమవుతాయి.ఇంకా అల్లం బాగా గ్రైండ్ చేసి ఒక గ్లాసులో వేసి, అందులో నీళ్లు పోసి, ఆ నీళ్లలో సోపు, జీలకర్ర, ఇంగువ ఇంకా అలాగే 2 పుదీనా ఆకులు వేసి ఒక పాత్రలో వేసి వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత వాటిని బాగా వడకట్టి తాగాలి. దీన్ని తాగడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఈజీగా తొలగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news