చంద్రబాబు ముసలి రాముడైతే, రామోజీ ఏమో పింజెర పాము – విజయసాయిరెడ్డి

-

పింజెర పాములా ‘అక్షరాలతో’ జనాన్ని కరుస్తున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. బాబుది, డ్రామోజీ కులనాడుది ప్రభుత్వంపై విషం గుమ్మరించడమే ఎజెండా. కొనఊపిరితో ఉన్న పచ్చ పార్టీకి వంద ఆక్సిజన్ పైపులు పెట్టయినా బతికించాలని ముసలి రాముడి ఆరాటం. పింజెర పాములా ‘అక్షరాలతో’ జనాన్ని కరవాలని కోరలు చాస్తుంటాడు. శక్తి ఉడిగిపోయిన సర్పాన్ని చూసి ఎవరు భయపడతారు? అని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి.


అవినీతికి ప్యాంటు, షర్టు తగిలిస్తే చంద్రంలా ఉంటుంది అని ‘తెహెల్కా’ అప్పట్లో రాసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ నెట్లో కనిపిస్తుంది. 2 ఎకరాల నుంచి 5 లక్షల కోట్లు కొల్లగొట్టిన బతుకని దేశమంతా తెలుసు. ఒకే సామాజికవర్గమాయె. చేతులు పీకుతున్నా డ్రమ్స్ బాదుతుంటాడు రామోజీ. ‘ఖర్మ’ అనుకోడు! అన్నారు. “కులానికి ఒక్కడు” అని పెద్దలు అంటారు. తన స్వార్థం కోసం, ప్రజాహితం, సామాజికవర్గ హితం అనే పేరుతో మొత్తం మంచి కులానికే చెడ్డ పేరు తెస్తున్న రాక్షసాంశ…రామోజీది! ఈ నిజాన్ని సొంత సామాజికవర్గం గ్రహించినా, అడ్డుకునేందుకు తాము ఏమీ చేయలేనంత శక్తివంతుడయ్యాడనే దిగులుతో ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version