ఘనంగా నీలిమ గుణ పెళ్లి రిసెప్షన్ .. తరలివచ్చిన తారాలోకం..!

-

ప్రముఖ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా తన కూతురి వివాహాన్ని జరిపించి బాధ్యత నెరవేర్చుకున్నాడు అని తెలుస్తోంది. ఈ క్రమంలోని డిసెంబర్ 3వ తేదీన గుణశేఖర్ కుమార్తె ప్రముఖ నిర్మాత అయిన నీలిమ గుణ వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు బిజినెస్ మాన్ అయిన రవి ప్రఖ్యాతో నీలిమ వివాహం జరిగింది. అయితే వీరి వివాహం హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరగడం గమనార్హం. మరి ఈ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు దర్శకనిర్మాతలు ఇలా చాలామంది హాజరయ్యారు.

ఇకపోతే ఆదివారం సాయంత్రం గుణశేఖర్ తన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించగా..

ఆ రిసెప్షన్ కి సినీలోకం తరలివచ్చింది. ముఖ్యంగా నీలిమ, రవి రిసెప్షన్ కోసం స్టార్ హీరోలైనటువంటి మహేష్ బాబు, అల్లు అర్జున్, ఆయన కూతురు అల్లు అర్హ కూడా హాజరయ్యారు. అయితే ఉన్నట్టుండి మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూడడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీరితోపాటు రాజమౌళి దంపతులు, జీవిత రాజశేఖర్ దంపతులు, శ్యాం ప్రసాద్ రెడ్డి , రాఘవేంద్రరావు, సుబ్బిరామిరెడ్డి వంటి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వివాహ రిసెప్షన్ కి హాజరయ్యి సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. నీలిమ గుణ ఇప్పటికే నిర్మాతగా సమంత నటించిన శాకుంతలం సినిమాకి వ్యవహరించింది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే నీలిమ కూడా నిర్మాతగా సక్సెస్ అయినట్టే..

Read more RELATED
Recommended to you

Exit mobile version