షిర్డీ సాయిపై ప్రమాణం – విజయసాయి సంచలన ట్వీట్

-

షిర్డీ సాయిపై ప్రమాణం అంటూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు…అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి అంటూ ఛాలెంజ్‌ చేశారు సాయిరెడ్డి.

మద్యం సిండికేట్లు, కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు, ఆక్రమణలు, కబ్జాలు చేయని అమాయకుడివా? జేబులో చిల్లర డబ్బుతో విశాఖకు వచ్చావు. ఇప్పుడు నీ ఆస్తులు వేల కోట్లు ఎలా అయ్యాయి ? అని నిలదీశారు.

ఇక మరో ట్వీట్‌లో అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి! అని నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news