కులీ కుతుబ్ షా ఆత్మ నీపై కాండ్రించి ఉమ్మేస్తుందని చంద్రబాబుకు చురకలు అంటించారు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. 2004 లో జగన్ సీఎం అయి.. ఉంటే.. హైదరాబాద్ పరిస్థితి ఏం అయ్యేదని చంద్రబాబు అన్న వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చాడు.
ఒరేయ్ వెన్నుపోటు డర్టీ ఫెలో…నీ పాతడప్పు ఆపురా! హైదరాబాద్ నేనే కట్టానని చెప్పుకుంటే కులీ కుతుబ్ షా ఆత్మ నీపై కాండ్రించి ఉమ్మేస్తుంది. అల్జీమర్స్ వ్యాధితో ఊహల్లో ఉరేగుతున్నావ్ – అలాగే కొంతకాలం నేనే సీఎం అనుకుంటూ బతికేయ్ అంటూ చంద్రబాబుపై ట్వీట్ చేశారు సాయిరెడ్డి.
నాకో డౌట్ లోకేశూ…తాతంటే ఖర్జూర నాయుడు కదా ఎప్పుడూ ఎన్టీ రామారావు అని చెప్పుకుంటావే! రెండెకరాల రైతు ఖర్జూర నాయుడు పేదవాడని చులకనా? ఆయన బతికుండగా ఏనాడైనా తాతయ్యా అని దగ్గరికెళ్లి చేయి పట్టుకున్నావా అని ఎద్దేవా చేశారు. అసహ్యించుకుని ఉంటావు. కుటుంబ మర్యాదల గురించి మీరు నీతులు చెప్పడమేంట్రా బాబూ! అంటూ ఫైర్ అయ్యారు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.