విజయవాడ దుర్గ గుడిలో సింహాల మాయంపై కేసు నమోదు చేసామని విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. దుర్గ గుడి ఈఓను కూడా పిలిచామని ఆయన అన్నారు. సంఘటన జరగడానికి ముందే మొత్తం ప్రార్ధన మందిరాల వారిని కూడా పిలిచామని, దుర్గగుడి సంఘటన జరగడానికి ముందే మీటింగ్ పిలిచి సీసీ కెమెరాలు పెట్టమన్నామని అన్నారు. అలానే దేవాలయాలు, ప్రార్ధన మందిరాల వారు వాలంటీర్లను పెట్టుకోవాలన్న ఆయన సీసీఎస్ పోలీసులు కూడా దుర్గ గుడి సంఘటనపై విచారణ చేస్తారని అన్నారు.
ఇక దుర్గగుడి రథంపై మీడియాతో ఆలయ ఈవో సురేష్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రథం అనేది చిన్న వస్తువు కాదు.. లాకర్ లో పెట్టి చేసేది కాదని అన్నారు. సుమారు 250 కేజీల వెయిట్.. చెక్కమీద సిల్వర్ షీట్ కొట్టి తయారుచేశారు, అది 18 ఏళ్ల క్రితమే తయారైన రథం, అప్పుడున్న వెయిట్ ఇప్పుడుండదని అన్నారు. ఇప్పుడు ఊడిన విగ్రహాల్నే అందరూ చూశారు, అవి ఎంత నల్లగా ఉన్నాయో అందరికీ తెలుసని ఆయన అన్నారు. అసలు నిజంగా అది వెండిదా..? కాదా..? దాన్ని ఊడదీసి తూకం వేసి పరిశీలించాలని అన్నారు. నాకు వెండి రథం అని ఇచ్చారు, అది కూడా నేను చూసుకోవాలి కదా..? ఇప్పుడందుకే అన్నీ టెస్ట్ చేయిస్తున్నానని ఆయన అన్నారు.