నేడు విశాఖ సింహాద్రి అప్పన్న టికెట్లు విడుదల..

-

విశాఖ సింహాద్రి అప్పన్న భక్తులకు అలర్ట్‌. నేటి నుంచి సింహాచలం చందనోత్సవం టిక్కెట్లు విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దేవస్థానం కౌంటర్ లతో పాటు బ్యాంకుల్లోనూ ఈ నెల 7 వరకు అమ్మకాలు జరుగనున్నట్లు సింహాద్రి అప్పన్న ఆలయ అధికారులు తెలిపారు.

ఆన్ లైన్ లోనూ 300,1000,1500 రూపాయల టిక్కెట్లు లభ్యం అవుతాయని వివరించారు. ఈ నెల 10న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు జరిగే చందనోత్సవం లో ఏటా లక్షల సంఖ్యలో పాల్గొంటున్నారు భక్తులు. ఈ తరుణంలోనే.. నేటి నుంచి సింహాచలం చందనోత్సవం టిక్కెట్లు విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news