నేటి రాత్రి నుంచి మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారం

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఇవాళ రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేదం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. ఆ వెంటనే రామగుండంలో రోడ్‌ షోతో మళ్లీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4వ తేదీన మంచిర్యాల, 5వ తేదీన జగిత్యాల, 6వ తేదీన నిజామాబాద్‌, 7వ తేదీన కామారెడ్డి, మెదక్‌, 8వ తేదీన పటాన్‌చెరు, నర్సాపూర్‌, 9వ తేదీన కరీంనగర్‌ రోడ్‌ షోలో పాల్గొననున్నారు. 10వ తేదీన సిరిసిల్లలో రోడ్‌షో అనంతరం…సిద్దిపేటలో బహిరంగ సభతో బస్సు యాత్ర ముగియనుంది.

ఇక ఇవాళ్టి రోడ్షోకు పార్టీ శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గులాబీ నేతలు తెలిపారు. 48 గంటల గ్యాప్ తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రజలతో సంభాషించనున్నారు. ప్రశ్నించే గొంతుకను ఎవరూ అణగదొక్కలేరని ఇప్పటికే ఈసీ చర్యలపై, కాంగ్రెస్ కుట్రపై కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డబుల్ స్పీడ్తో ప్రచారాన్ని హోరెత్తించేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news