విశాఖ భూ కుంభ కోణాలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సంచలన ప్రకటన చేశారు. విశాఖ భూ కుంభ కోణాలపై వైజాగ్ ఫైల్స్ రెడీ అవుతున్నాయని హెచ్చరించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. ఇవాళ మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. గత ప్రభుత్వంలో ఇన్ చార్జీలు, అధికారులు, మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
డి ఫాం, జిరాయితీ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. విశాఖ – భీమిలి మధ్య ఒక వ్యక్తి రెండు లక్షల అడుగులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. అందరి లెక్కలు బయటకు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులైన అందరిపైనా కఠిన చర్యలు ఉండబోతున్నాయని హెచ్చరించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.