రఘురామకృష్ణం రాజుకి దిమ్మతిరిగే క్లాజ్ వెతికిపట్టారంట… నరసాపురంలో ఇక ఉప ఎన్నికలే!

ప్రశాంతంగా ప్రయాణిస్తున్న వైకాపాలో పెద్ద అలజడినే సృష్టించ ప్రయత్నించినట్లున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు! ఇందులో భాగంగా జిల్లాలో అవినీతి అని, ఇసుక కొరత అని రకరకాల కారణాలు చెప్పి పార్టీని రోడ్డుమీదకు ఈడ్చే పనికి పూనుకున్నారు! ఇంతలో స్థానిక ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజలు వాస్తవాలు గ్రహించి.. రఘురామకృష్ణంరాజు ఉద్దేశ్యాలు వేరని, తన పోరాటం తనకోసమే తప్ప ప్రజలకోసం కాదని తెలుసుకునేసరికి… పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయిపోయాయి.


అనంతరం వాటిలో లొసుగులు ఉన్నాయని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపారు రఘురామకృష్ణంరాజు. అక్కడనుంచి చూడాలి ఎల్లోమీడియా సంబరాలు.. అదిగో వైకాపా రద్దు… ఇదిగో వైకాపాకు ఎన్నికల కమిషన్ నోటీసులు అంటూ ఊకదంపుడు వార్తలు వండి వడ్డించేశారు. తీరాచూస్తే ఢిల్లీలో కథ మరోలా ఉందని వార్తలొస్తున్నాయి. దానికి కారణం… “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” అస్త్రాన్ని వైకాపా అధినాయకత్వం రఘురామకృష్ణం రాజుపై ప్రయోగించబోతుందంట. ఇది వినడానికి కాస్త కొత్తగా ఉన్నా… అంత కొత్త విషయం అయితే కాదు కానీ… చాలా మందికి తెలియని విషయం!

ఇప్పటిదాకా పార్టీని ధిక్కరించిన వారిని ఆయా పార్టీలు సస్పెండ్ చేస్తే.. వారికి ఆ పార్టీతో బంధం మాత్రమే తెగిపోయేది.. ఫలితంగా వారు రెక్కలొచ్చిన పక్షులు అయిపోయేవారు. కానీ ఈ క్లాజు ప్రకారం పార్టీ అధినాకత్వాలు ముందుకి వెళ్తే… ఆ పార్టీ పరంగా ఇచ్చిన పదవి కూడా ఊడిపోతుందట. ఈ అస్త్రాన్నే ప్రస్తుతం రఘురామకృష్ణం రాజుపై ప్రయోగించారంట జగన్! గతంలో కూడా ఇలానే జనతాదళ్ (యూ) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ పై ఈ నిబంధన కిందే అనర్హుడిగా ప్రకటించారని అంటున్నారు.

ఇదే జరిగి రఘురామకృష్ణం రాజుకి ఈ నిబంధన వర్తింపచేయగలిగితే మాత్రం…ఆయన మరో మూడు నెలల్లో మాజీ అయ్యే అవకాశాలున్నయని అంటున్నారు! ఈ నిబంధలన కింద ఏ రాజకీయ పార్టీ అయినా చట్టసభల్లో తమ సభ్యుడి మీద స్పీకర్ కి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఈ క్లాజ్ చెబుతోందంట! ఇపుడు ఈ క్లాజ్ ని వెతికిపట్టుకునిమరీ రఘురామకృష్ణంరాజు మీద వైసీపీ ప్రయోగిస్తోందంట. ఈలెక్కన వైకాపా ఆశిస్తున్నట్లు అంతా అనుకూలంగా జరిగితే నర్సాపురంలో ఉప ఎన్నికల ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారే అవకాశాలు లేకపోలేదు!!

Note: “The words “voluntarily given up his membership” are not synonymous with “resignation” and have a wider connotation. A person may voluntarily give up his membership of a political party even though he has not tendered his resignation from membership of that party. Even in the absence of a formal resignation from the membership an inference can be drawn from the conduct of a member that he has voluntarily given up his membership of the political party to which he belongs.”