కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం : అంబటి రాంబాబు

-

కృష్ణా నది పంపకాలకు సంబంధించి దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసిందని, 2010లో తుది నివేదిక ఇచ్చిందన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని రాష్ట్రం సుప్రీంకోర్టులో ఎస్ ఎల్ పీ వేసిందన్నారు మంత్రి అంబటి. అప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించిందని, ఆ తర్వాత కేంద్రం మరో ట్రిబ్యునల్ వేసిందన్నారు. బ్రజేష్ కుమార్ కు కొనసాగింపు ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు టీఓఆర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమని, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇప్పటికే విధివిధానాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.


కొత్త విధివిధానాలు అప్పగించడం చట్ట విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారన్నారు. న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగితే సహించమని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావలసిన ఒక్క నీటి బొట్టును వదులుకోమన్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఉందని, అవినీతి ప్రభుత్వానికి మొదట మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కాదు అసలు ఆ రెండు పార్టీల ఓట్లు కలుస్తాయని, పవన్ కళ్యాణ్ కు ఉన్నదంతా చిత్తశుద్ధి కాదు చెత్తశుద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news