రాష్ట్రంలో వైసీపీ ఇన్ చార్జీల మార్పుపై టిడిపి జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహా సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. టిడిపి జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలని చురకలాంటించారు సజ్జల. ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో వాళ్లకే ఇప్పటికీ స్పష్టత లేదని విమర్శలు గుప్పించారు. మార్పులు చేర్పులు అన్నీ అంతర్గత వ్యవహారం.. 2014లో చంద్రబాబు చేసిన తప్పుడు పనులు జనం మర్చిపోయారు అనుకుంటున్నారని సజ్జల తెలిపారు.
సీఎం జగన్ ని నారా లోకేష్ ఇమిటేట్ చేస్తుంటాడని సజ్జల పేర్కొన్నారు. లోకేష్ 3000 కిలోమీటర్లు పాదయాత్ర ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదు. నాయకుడిని మారిస్తే కింద ఉన్న క్యాడర్ ఇబ్బంది పడటం సహజం. అందరిని పిలిచి మాట్లాడుతామని తెలిపారు. చిన్న చిన్న చికాకులను సరిదిద్దడం పెద్ద విషయం కాదు.. కుప్పంతో సహా 175 స్థానాల్లో వైసిపి పార్టీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలిచే అవకాశం లేదని సజ్జల వెల్లడించారు. బీసీల స్థానాల్లో చంద్రబాబు లోకేష్ ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. మా పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేయాలో మాకు తెలుసు ఎలా గెలవాలో గెలవాలంటే ఏం చేయాలో ఆ స్ట్రాటజీ మాకు ఉందని సజ్జల తెలిపారు.