వచ్చే ఏడాది మార్చ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక సీఎం జగన్ చేతుల మీదుగా తాగు, సాగు నీరు అందిస్తామని అన్నారు. అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని అన్నారు. పద్ధతి లేకుండా తోకలేని కోతులలాగా ప్రాజెక్టు లోకి వెళతామని అంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
పోలవరాన్ని చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు. రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన ఘనత చంద్రబాబుదని.. ఇప్పుడు బియ్యం లో రాళ్లు ఏరుతున్నట్టు టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.