రైతుల కోసం మోడీ సర్కార్ వినూత్నమైన విధానాలను తీసుకొస్తుంది – కిషన్ రెడ్డి

-

రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు వినూత్నమైన విధానాలను మోడీ సర్కార్ తీసుకొస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఫసల్ భీమా యోజన లాంటివి అమలు చేస్తున్నామన్నారు. కనీస మద్దతు ధర 2014 తో పోలిస్తే 5.7 రెట్లు పెరిగిందన్నారు. బియ్యం ఎగుమతులు 109 శాతం పెరిగాయన్నారు. ఇక వంట నూనెల దిగుమతి తగ్గించామన్నారు. రైతుల నుండి నూనె గింజల సేకరణ 15 వందల శాతం పెరిగిందని తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాలికను ఖరారు చేసిందన్నారు. యూరియా ఒక బస్తా పైన 2 వేల 236 రూపాయలు సబ్సిడీ కేంద్రం ఇస్తుందన్నారు. అలాగే డిఏపి ఒక బస్తా పైన 2422 రూపాయల సబ్సిడీ ఇస్తుందన్నారు. ఒక ఎకరా ఉంటే ఏడాది కి 18 వేల 612 రూపాయల సబ్సిడీ రైతుకు లభిస్తుందన్నారు. 10 ఎకరాలు ఉంటే రైతుకి ఎరువుల సబ్సిడీ ఏడాదికి లక్ష 86 వేల 120 రూపాయలు లభిస్తుందన్నారు. తెలంగాణ లో 39 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందుతుందని తెలిపారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news