ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా లోని మార్కాపురంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మార్కాపూరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈ పట్టణం చుట్టూ 250కి పైగా గ్రామాలు ఉత్ప్రేయని, వాటన్నింటికీ ఇదే పెద్ద పట్టణం అని ఓ యువతి చెప్పారు.
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. మార్కాపూరన్ని జిల్లా చేస్తానని ఎన్నికల్లోనే హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా మార్కపూరాన్ని జిల్లా కేంద్రం చేస్తాం అన్నారు. అంతేకాదు మార్కాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.