పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం ఆడబిడ్డల ఆశీర్వాదంతో తొలగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో మహిళలు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో నిలబడ్డారని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుంది. వారు తల్చుకుంటే దానిని సాధించడం కష్టమేమి కాదు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను మహిళలు గమనిస్తున్నారని పరేడ్ గ్రౌండ్ సభలో వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఏవైనా ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తే.. తనను తిట్టొచ్చని బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. టన్నెల్ కూలితే.. పంటలు ఎండితే నన్ను తిట్టవచ్చని పైశాచిక ఆనందం పొందుతున్నారు. 10 నెలలు కాకపోయినా ఈ ఏడుపులు ఏంటి..? ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నించాలి. పదేళ్ల పాలన అనుభవం ఉన్న మీరు అభివృద్ధిలో భాగం కండి. మాకు సలహాలు ఇవ్వండి అని పరేడ్ గ్రౌండ్స్ సభలో సూచించారు.