బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు ఆడబిడ్డలకు గ్రహణం పట్టింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సికింద్రాబాద్ లో మంత్రి సీతక్క అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడ్డారు. చంద్రగ్రహణం అంతరించిపోయిందన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని చూస్తే.. వన్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యం అవుతుందన్నారు.
ఇందిరమ్మ రాజ్యం కావాలని మహిళలు కోరుకున్నారు. కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రగ్రహణం అంతరించిపోవడంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. ఆడబిడ్డలు చాలా మంది చదువుకున్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు కాబోతున్నారని తెలిపారు. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా చేస్తామన్నారు. సోలార్ ఉత్పత్తిలో అంబానీ, ఆదానీలతో మన ఆడబిడ్డలు పోటీ పడేలా తయారవుతారు. ఇందిరమ్మ, ప్రతిభా పాటిల్, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రియాంక గాంధీ కూడా చట్టసభలో ఉందని తెలిపారు.