ఏపీ నుంచి వెళ్లిన కంపెనీలను మళ్లీ రప్పిస్తామని…కొత్త ఇండస్ట్రీయల్ పాలసీలు తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా 100 ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. రోజుకు 1.45 లక్షల మంది రూ. 5కే బోజనం చేసేవారని… గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసిందని ఆగ్రహించారు. మళ్లీ పేదల కోసం అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.
గిరిజన మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు పెడతామని… అన్న క్యాంటీన్లకు విరివిగా విరాళాలివ్వాలని కోరారు సీఎం చంద్రబాబు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు స్కిల్ సెన్సస్ చేపడుతున్నామని ప్రకటించారు. ప్రపంచంలో తొలిసారి స్కిల్ సెన్సస్ చేపడుతున్నామని… నిర్మాణ రంగ కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక విధానం తెచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ ఉంటుందని హెచ్చరించారు సీఎం చంద్రబాబు .