ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశాల మీద ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడినా సరే దానికి మీడియాలో అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వారి అనుకూల మీడియా సహా సోషల్ మీడియాలో పదే పదే జగన్ మీడియా సమావేశం గురించి ప్రస్తావిస్తూ ఆయనపై నేరుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా ఆయన మీడియా సమావేశాలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. జగన్ ఏం మాట్లాడినా సరే తప్పులు ఉంటున్నాయి. ఇక ఇటీవల ఆయన మీడియా సమావేశాలను రికార్డ్ లైవ్ అని వ్యాఖ్యలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జగన్ మాట్లాడిన సందర్భంలో లైవ్ అని చెప్పినా సరే వీడియోలో ఉన్న ఆయన చేతి వాచ్ సమయాన్ని చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
అది రికార్డ్ చేసిన వీడియో అనే విషయం అర్ధమైంది. దీనితో తాజాగా జగన్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన సమయంలో చేతికి వాచ్ లేకుండా కనపడ్డారు. ఆయన వాచ్ లేకుండా అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా లేరు. ఇప్పుడు ఆయన అలా కనపడటంతో ఇప్పుడు సమీక్షా సమావేశం కూడా లైవ్ కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తున్నారు. జగన్ చేతి వాచ్ 13 లక్షలు… అది పోయిందా అంటూ కామెంట్ చేస్తున్నారు.