ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎమ్మెల్యేల లాక్ డౌన్ ఉల్లంఘన వ్యవహారం తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని అధికారుల మాటలను లెక్క చేయడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని జిల్లాలో వైరస్ పెరగడానికి ఎమ్మెల్యేలు ప్రధాన కారణం అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే చర్యలు తీసుకునే అధికారుల విషయంలో కూడా వైసీపీ నేతలు కాస్త దురుసుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఒకరు ఇలాగే చేసారు.
కలెక్టర్ కి ఎస్పీ కి ఆయన నేరుగా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై సిఎం జగన్ ఆరా తీసారు. ఎమ్మెల్యే గారికి జగన్ స్వయంగా ఫోన్ చేసినట్టు సమాచారం. అధికారులకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారట. సదరు జిల్లా కలెక్టర్ కి ఎస్పీ కి కూడా జగన్ ఆదేశాలు ఇచ్చారట. అధికారుల విషయంలో ఎవరు అయినా సరే ఆగ్రహంగా మాట్లాడిన నోటికి వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేసినా సరే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారట.
మంత్రులకు కూడా ఇదే వార్నింగ్ ఇచ్చారట జగన్. అధికారుల అవసరం చాలా ఉందని వారి విషయంలో దూకుడుగా వెళ్ళవద్దు అని చెప్పారట. ఇలా చేసే తెలుగుదేశం హయాంలో అధికారులు దూరం అయ్యారని ఇప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచించారట జగన్. ఇక నుంచి ఎవరు అధికారుల విషయంలో నోరు జారినా సరే తాను చర్యలు తీసుకోవడం ఖాయమని జగన్ హెచ్చరించినట్టు సమాచారం.