Macharla: మాచర్లలో టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు!?

-

Macharla: మాచర్లలో టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు!? అంటూ వైసీపీ పార్టీ ప్రశ్నిస్తోంది. మాచర్ల నియోజక వర్గంలో విచ్చలవిడిగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి రిగ్గింగ్ చేసినట్లు వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అడ్డోచ్చిన వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడి చేసినట్లు కూడా వెల్లడిస్తోంది. రిగ్గింగ్ అడ్డుకోవడంతో తుమృకోటలో 4 ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు టీడీపీ నేతలపై వైసీపీ విమర్శలు చేస్తోంది.

RE POLLING IN MACHARLA

అయినా వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లిపై ఆరోపణలు చేస్తోందని వైసీపీ పార్టీ మండిపడుతోంది. పోలింగ్ సక్రమంగా జరగలేదంటూ గగ్గోలు పెడుతోందని…అయినా మాచర్ల నియోజక వర్గంలో రీపోలింగ్ కు టీడీపీ పార్టీ డిమాండ్‌ చేయడం లేదని రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చింది వైసీపీ పార్టీ. అంటే తమకు అనుకూలంగా ఎన్నికలు జరిగినట్లేగా..అంటూ కామెంట్స్‌ చేస్తోంది వైసీపీ. ఇక అటు మరోవైపు.. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్ కోరారు ఎమ్మెల్యే పిన్నెల్లి. రీపోలింగ్ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఫైర్‌ అయ్యారు పిన్నెల్లి.

Read more RELATED
Recommended to you

Latest news