ఫ్యాన్ కే ఓటేస్తాo.. ప్రచారంలో టీడీపీ అభ్యర్థికి షాకిచ్చిన మహిళలు

-

ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభావం ఏమాత్రం లేదని మరోసారి తేలిపోయింది. ఎవరెన్ని హామీలు ఇచ్చినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని స్పష్టమైంది.మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన జగన్ కే పట్టం కట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని ప్రజలు చెప్పేస్తున్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు నీరాజనాలు పడుతున్నారు.అలాగే టీడీపీ చేస్తున్న యాత్రలకు, ప్రచారాలకు జనం దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా తిరువూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ అభ్యర్థికి ఘోర అవమానం ఎదురైంది. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని టీడీపీ అభ్యర్థి కోరగా, అక్కడే ఉన్న ప్రజలు తాము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని చెప్పి షాకిచ్చారు. దీంతో ఆ అభ్యర్థి ప్రచారాన్ని ముగించి అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఎన్టీఆర్ జిల్లా , తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కొలిక‌పూడి శ్రీనివాసరావు పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. అమరావతి రైతులకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొన్న ఆయనకు చంద్రబాబు తిరువూరు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తిరువూరు బాధ్యతలు చేపట్టిన కొలిక‌పూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల మధ్యలోకి వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని స్థానికులను కోరగా..అక్కడున్న పలువురు మహిళలు తాము ఫ్యాన్‌కే ఓటు వేస్తామని ధైర్యంగా చెప్పారు. కొలిక‌పూడి శ్రీనివాస్ సైకిల్ సైకిల్ అని చెప్పగా మహిళలు మరింత గట్టిగా ఫ్యాన్.. ఫ్యాన్ అంటూ అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తిరువూరులో కూటమి తరపున టీడీపీ నుంచి కొలిక‌పూడి శ్రీనివాస్ బరిలో ఉండగా, అధికార వైకాపా నుంచి మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాసు పోటీ చేస్తున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని పక్కన పెట్టి మరి టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన స్వామిదాసుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది.అభ్యర్థిని మార్చినా ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని తెగేసి చెప్తున్నారు.సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పాలనను మళ్లీ తెచ్చుకుంటామని ధీమాగా అంటున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది.ఏపీలో ఫ్యాన్ మళ్లీ గిర గిరా తిరగడం ఖాయమని సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. మరోవైపు కూటమి నేతలు ప్రజల్లోకి రావడం వృధా ప్రయాసే అని విశ్లేషకులు కూడా చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news