వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేను జగన్ తోనే వైసీపీలోనే ఉన్నాను..అని వెల్లడించారు యార్లగడ్డ వెంకట్రావు. వైసీపీ నుంచే సీటు ఇస్తారని ఆశిస్తున్నానని.. అమెరికా నుంచి తీసుకు వచ్చి జగన్ నన్ను క్రాస్ రోడ్డులో నిల్చో పెడతారని నేను అనుకోవటం లేదని వివరించారు. జగన్, వైసీపీ అధిష్టానం నాకు అన్యాయం చేస్తారని అనుకోవటం లేదని.. గత ఎన్నికల్లో నేనే ఇక్కడ నుంచి పోటీ చేశానని గుర్తు చే శారు.
గన్నవరం వేరే సీటు వారికి ఇచ్చామని ఇంకా ప్రకటన చేయలేదు కదా… టీడీపీలో నేను జాయిన్ అవుతా అనేది సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. పెనమలూరు సీటు ఇస్తా అని జగన్ అంటే నేను ఇండియా వచ్చాను…తర్వాత గన్నవరం సీటు నుంచి జగన్ పోటీ చేయమని చెబితే అక్కడ నుంచి పోటీ చేసానని వివరించారు. గన్నవరం లో వైసీపీని పటిష్టం చేశానని.. రిగ్గింగ్, దొంగ ఇళ్ళ పట్టాల కారణంగా ఓటమి పాలయ్యాని చెప్పారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. నేను గెలిచి ఉంటే నియోజక వర్గానికి ఈ ఖర్మ ఉండేది కాదని.. కొన్ని కారణాలతో గన్నవరంలో రాజకీయాలకు దూరంగా ఉన్నా తప్ప నియోజక వర్గానికి కాదన్నారు. జగన్ నాకు గన్నవరం అనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని తెలిపారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.