ఇటీవల ముగిసిన అయిదు టెస్టు మ్యాచ్ ల యాషెస్ సిరీస్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గత యాషెస్ సిరీస్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియానే టైటిల్ ను రిటైన్ చేసుకుంది. ఆఖరి టెస్ట్ ను ఓడిపోయినా విధానం పట్ల పాంటింగ్ బంతిని మార్చడం వల్లనే ఇలా జరిగిందంటూ వివాదాన్ని సృష్టించాలని చూసినా దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇక తాజాగా ఐసీసీ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్లకు భారీ షాక్ ఇచ్చింది. ఈ సిరీస్ లో రెండు జట్లు కూడా స్లో ఓవర్ రేట్ కు పలాడడం వలన ఐసీసీ భారీగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో పాయింట్ లను కోసేసింది. అందులో భాగంగా ఇంగ్లాండ్ 19 పాయింట్ లను కోల్పోగా, ఆస్ట్రేలియా 10 పాయింట్ లను కోల్పోయింది.
ఇక ఇప్పటి వరకు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లు జరగగా మొదటి దానిలో న్యూజిలాండ్ గెలవగా , రెండవసారి ఇండియా పై ఆస్ట్రేలియా విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. ఇక మూడవ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఏ రెండు జట్లు చేరుతాయి ? అన్నది తెలియాల్సి ఉంది.