తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం టూర్ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, అల్లూరి జయంతి నిర్వహణ చూస్తే వైసీపీ, బీజేపీ కార్యక్రమంలాగే సాగిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా ఇందులో దాపరికం ఏమీ లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై సిపిఐ రామకృష్ణ ఘాటుగా స్పందించారు. బీజేపీతో స్నేహం కారణంగా వైసీపీ రాష్ట్రానికి నిధులు తెస్తుందన్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని కోటగిరి చెప్పారని, ఇప్పటి వరకు ఏమి చేశారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు బిజెపికి మద్దతు ఇచ్చారని చెప్పారు. వైసీపీ – బీజేపీ బంధం నరేష్ – పవిత్ర మాదిరిగా పెళ్లి కాకుండా బిజెపి – వైసిపి సహజీవనం చేస్తున్నట్లు గా ఉందన్నారు. మూడు సంవత్సరాలుగా బీజేపీ – వైసీపీ రంకు రాజకీయం నడుపుతున్నాయని రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. షరతులతో బిజెపి ప్రభుత్వంలో వైసిపి చేరతామంటున్నారని ఆయన విమర్శించారు.