జ‌గ‌న్ కు షాక్‌.. అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు వైసీపీ ఎంపీ

ఏపీ ముఖ్య మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి … వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మ‌రోషాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీకి వ్య‌తిరేకంగా.. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు వ‌చ్చారు ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు. ఈ నేప‌థ్యంలోనే… ఆయ‌న ఇవాళ ఢిల్లీ నుంచి తిరుప‌తి కి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ.. అమరావతి పరి రక్షణ మహోద్యమ సభలో పాల్గొనేందుకు వచ్చాన‌ని పేర్కొన్నారు. అడ్డం ప డే మేఘాలు అశాశ్వతం, అమరా వతే శాశ్వతమ‌న్నారు. న్యాయంగా అమరావతి లోనే రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. ఇది దగా పడ్డ రైతుల సభ, రాజకీయ సభ కాదని వెల్ల‌డించారు. ఈ సభ తరువాత మూడు రాజధానుల గురించి మాట్లాడే వారు ఉండరని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పడ్డ వాడు చెడ్డ వాడు కాదు, చంద్రబాబు చెడ్డ వాడు కాదంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.